ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ!
- ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘటన
- ప్రేయసి కోసం బురఖాలో వెళ్లిన చాంద్ భురా అనే యువకుడు
- అనుమానంతో పట్టుకుని చితక్కొట్టిన స్థానికులు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని కలవడానికి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బురఖా ధరించి వెళ్లాడు. అయితే, అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొరాదాబాద్‌లో పట్టపగలు ఈ ఘటన జరిగింది. ప్రేయసి కోసం బురఖాలో వెళ్లిన యువకుడిని చాంద్ భురాగా గుర్తించారు. అతను బురఖా ధరించి పొరుగున ఉండే తన ప్రియురాలిని కలవడానికి వెళ్ళాడు. అలా బురఖాలో వెళ్లిన చాంద్‌ను చూసి స్థానికులకు అంతడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. మొదట్లో కొందరు దొంగగా, మరికొందరు పిల్లల కిడ్నాపర్‌గా భావించారు.
దాంతో వెంబడించి అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత బురఖా తొలగించి చూడగా, అందులో యువకుడు ఉండడంతో వారంతా షాక్ అయ్యారు. చాంద్‌ను ఆధార్ కార్డు చూపించాలని అడిగిన స్థానికులు.. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చాంద్ భురా వద్ద నుంచి పోలీసులు లైటర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.