రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ విరాళం!
- తెలంగాణ, ఏపీలో భారీ వర్షాల బీభత్సం
- వరద ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం
- వరద విపత్తు నుండి ఉపశమనం కోసం ప్రముఖుల విరాళాలు
- రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన ఎన్టీఆర్
భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు వరద బాధితులకు తమవంతు సాయం చేందుకు ముందుకు వస్తున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ విరాళాలు ప్రకటించారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను" అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.