బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్ జ్యూస్... విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం

  • విజయవాడలో 2.76 లక్షల మంది వరద బాధితులు
  • హెలికాప్టర్లను రంగంలోకి దించిన ఏపీ ప్రభుత్వం
  • బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్లతో ఆహారం అందజేత
విజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. 

బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు. ఇప్పటివరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీరు అందజేశారు. 

వరద బాధితులకు బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు. వాటితోపాటే ఫ్రూట్ జ్యూస్ (టెట్రా ప్యాక్ లు), ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. 

మరో మూడు హెలికాప్టర్లు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు.

కాగా, విజయవాడ వరద బాధితులకు ఆహారం అందించేందుకు దివీస్, అక్షయపాత్ర ముందుకువచ్చాయి. దివీస్ సంస్థ రోజుకు 1.70 లక్షల మందికి ఆహారం అందిస్తోంది. ఆహార పంపిణీ కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని దివీస్ ఎండీ మురళీకృష్ణ తెలిపారు. ఐదు రోజుల పాటు ఆహారం అందిస్తామని వెల్లడించారు. 



More Telugu News