100 కోట్ల దిశగా దూసుకెళుతున్న 'సరిపోదా శనివారం'

  • ఆగస్టు 29న విడుదలైన 'సరిపోదా శనివారం'
  • తొలిరోజు రూ.24.11 కోట్ల వసూళ్లు
  • నాలుగు రోజుల్లో రాబట్టిన వసూళ్లు రూ.68.52 కోట్లు
  • రూ.100 కోట్లు రాబట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్

నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' సినిమా వచ్చింది. ఆగస్టు 29వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. నాని జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య కనిపిస్తాడు. మరో కీలకమైన పాత్రను మురళీ శర్మ పోషించాడు. 

విడుదలైన రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజున రూ.24.11 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజులకు కలుపుకుని రూ.36 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజుతో కలుపుకుని రూ.52.18 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. నాలుగో రోజుతో కలుపుకుని రూ.68.52 కోట్ల వసూళ్లను సాధించింది. 

ఈ లెక్కలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు డీవీవీ బ్యానర్ వారు స్పెషల్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు. ఈ వారం నానీకి పోటీ ఇచ్చే తెలుగు సినిమాలేవీ బరిలో కనిపించడం లేదు. అందువలన వసూళ్ల పరంగా 'సరిపోదా శనివారం' జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ ను టచ్ చేయడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. 



More Telugu News