సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన సూచీలు
- 82,560 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
- లాభాల్లో ముగిసిన 1,684 షేర్లు
- బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల దూకుడు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు మరోసారి సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ స్టాక్స్ మంచి లాభాలు నమోదు చేశాయి.
సెన్సెక్స్ 194 పాయింట్లు లాభపడి 82,560 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు ఎగిసి 25,279 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. 1,684 షేర్లు లాభాల్లో... 2,191 షేర్లు నష్టాల్లో ముగియగా, 133 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
నిఫ్టీలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ టాప్ గెయినర్స్‌గా నిలవగా... గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా, నెస్లే ఇండియా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి.
క్యాపిటల్ గూడ్స్, మెటల్, హెల్త్ కేర్, టెలికం, మీడియా రంగాలు 0.4 శాతం నుంచి 1.6 శాతం మేర నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం మేర క్షీణించింది. సూచీలు ఈ రోజంతా లాభాల్లోనే కొనసాగాయి.