నా పెళ్లికి మా నాన్న ఒప్పుకోవడానికి కారణం ఇదే: యూట్యూబర్ ఈఆర్ యామిని!

నా పెళ్లికి మా నాన్న ఒప్పుకోవడానికి కారణం ఇదే: యూట్యూబర్ ఈఆర్ యామిని!
  • యూట్యూబర్ గా ఈఆర్ యామిని 
  • యూత్ లో మంచి ఫాలోయింగ్ 
  • ఇటీవలే వివాహం చేసుకున్న యామిని 
  • వీడియోస్ చేస్తూనే ఉంటానని క్లారిటీ

ఈఆర్ యామిని... యూట్యూబ్ స్టార్. స్వచ్ఛమైన చిరునవ్వు... తెలుగుదనం... చీరకట్టు ఆమె ప్రత్యేకత. ఆమె అభిమానుల సంఖ్యను పెంచింది కూడా అవే. వ్యూయర్స్ ఎక్కడ తన ఇంటికి వచ్చేస్తారోనని... చాలా కాలం పాటు ఆమె తన సొంత ఊరు పేరు చెప్పలేదంటే ఆమె క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫాలోయింగ్ ను అంచనా వేయవచ్చు. 

ఆమె ఒక పోస్ట్ పెట్టిందంటే వ్యూస్ పరంగా అది ఒక రేంజ్ లో దూసుకుపోతూ ఉంటుంది. అలాంటి ఈఆర్ యామిని ఇక త్వరలో లండన్ వెళ్లనుంది. 

యామినికి ఆ మధ్య ఒక సంబంధం కుదిరినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత అది నిజమేననే విషయాన్ని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఇటీవలే ఆ అబ్బాయితో ఆమె వివాహం జరిగిపోయింది. అతని పేరు అశోక్ .. లండన్ లో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త అశోక్ ను ఆమె పరిచయం చేసింది. 

యామినీ మాట్లాడుతూ... "అశోక్ గురించి మా అమ్మగారికి తెలుసు. తాను చాలా మంచివాడని మా అమ్మ చెప్పడం వల్లనే నేను అతణ్ణి ఇష్టపడ్డాను. అయితే నాకు నచ్చాడని నేను చెప్పడం వల్లనే ఈ పెళ్లికి మా నాన్న అంగీకరించారు. అశోక్ మాట... మంచితనం చూసిన తరువాత ఎమోషనల్ గా నేను కనెక్ట్ అయ్యాను" అని అన్నారు. 

"మా ఇంటికి వచ్చి అశోక్ నన్ను చూసిన తరువాత, ఒక ఏడాది గడువు పెట్టి వెళ్లారు. ఆ తరువాత కూడా తెలిసినవాళ్లు కొన్ని సంబంధాలు ఉన్నాయంటూ అమ్మానాన్నల దగ్గరికి తీసుకుని వచ్చారు. కానీ నేను అందుకు అంగీకరించలేదు.  అశోక్ తో పాటు వాళ్ల పేరెంట్స్ కూడా నన్ను బాగా చూసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఉంది. లండన్ వెళ్లినా వీడియోస్ చేస్తూనే ఉంటాను" అని చెప్పారు. 



More Telugu News