బాబాయ్‌కి వరుణ్ బర్త్‌డే విషెస్... ఆకట్టుకుంటున్న పవన్ అరుదైన ఫొటో
- నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
- సోషల్ మీడియా వేదికగా జనసేనానికి బర్త్‌డే విషెస్‌ల వెల్లువ
- ఎక్స్ వేదికగా బాబాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వరుణ్ తేజ్
నేడు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనపై బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు జనసేనానికి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక పవన్ కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా విషెస్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాబాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ తిరుగులేని సంకల్పం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మీలోని అగ్ని ప్రకాశవంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా పవర్ స్టార్మ్. హ్యాపీ బర్త్‌డే జనసేనాని" అంటూ వరుణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఇక ఈ ట్వీట్‌కు తన చిన్ననాటి ఫొటో ఒకటి జోడించాడు. ఆ ఫొటోలో పవన్ సోఫాలో కూర్చొని ఉండగా, వరుణ్ ఆయన కాళ్లు పడుతున్నాడు. వరుణ్‌ను పవన్ ఆశీర్వదిస్తున్నట్లు పోజు పెట్టడం కూడా ఆ ఫొటోలో ఉంది.