తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్షాలు, వరదలపై స్పందించిన రాహుల్ గాంధీ
- నా ఆలోచనలు తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఉన్నాయన్న రాహుల్ గాంధీ
- ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ నేత
- సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సహాయక చర్యల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పునర్నిర్మాణ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వారందరికీ సమగ్ర పునరావాస ప్యాకేజీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.