భయ్యా.. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.. వైరల్ వీడియోపై నెటిజన్ల కామెంట్లు

భయ్యా.. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.. వైరల్ వీడియోపై నెటిజన్ల కామెంట్లు
  • పెళ్లి కొడుకు ముందే పెళ్లి కూతురును వాటేసుకుని ముద్దులు
  • ముఖ కవళికలు మార్చేసి భావరహితంగా చూస్తూ ఉండిపోయిన పెళ్లికొడుకు
  • చివరికి ఇద్దరొచ్చి ఆ యువకుడిని విడిపించిన వైనం
జీవితంలోని అత్యంత కీలక ఘట్టం పెళ్లి. వైభవంగా చేసుకున్నా, సాదాసీదాగా చేసుకున్నా జీవితంలో ఒక మధుర ఘట్టంగా నిలిచిపోతుంది. వివాహమనేది కొందరికి కలకాలం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే.. ఇదిగో ఇలాంటి వారికి చేదు గుర్తుగా అనుక్షణం గుర్తు చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ‘పాపం పెళ్లికొడుకు!’ అనకుండా ఉండలేరు. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అలంకరించిన వేదికపై పెళ్లికొడుకు, పెళ్లి కూతురు చెరో కుర్చీలో పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. స్టేజిపైకి వచ్చిన ఓ యువకుడు పెళ్లి కుమార్తెను గట్టిగా పట్టుకుని ముద్దులు పెడుతూ హత్తుకుని ఏడ్చేశాడు. ఆమె వదిలించుకునే ప్రయత్నం చేసినా అతడు పట్టువిడవకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. అది చూసిన పెళ్లికొడుకు ముఖ కవళికలు మారిపోయాయి. భావ రహితంగా అటూఇటూ పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. చివరికి ఇద్దరు వ్యక్తులు స్టేజిపైకి వచ్చి అతడిని విడిపించారు.
 
ఈ వీడియో ప్రామాణికత ఎంత? అన్న విషయాన్ని పక్కనపెడితే వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసినవారు బోల్డన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ కుర్రాడు ఎవరు? అతడేమైనా ఆమె మాజీ ప్రియుడా? ఆమె పెళ్లి చేసుకోవడం చూసి భావోద్వేగానికి గురై ఏడ్చేశాడా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరు మాత్రం ‘అతడెవడండీ బాబూ!‘ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరేమో ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తుతోంది. కాగా, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అసలు నిజమైనదా? లేక ఫేక్? అన్న వివరాలు తెలియరాలేదు.


More Telugu News