చేసిన పొరపాటుకు 2 నెలలు ఏడుస్తూనే ఉన్నా: విక్రమ్

  • మణిరత్నం 'బొంబాయి' సినిమా ఛాన్స్ తొలుత తనకే వచ్చిందన్న విక్రమ్
  • ఫైనల్ ఆడిషన్ లో పొరపాటు చేశానని వెల్లడి
  • మణిరత్నం ఫిల్మ్ మేకింగ్ ను తాను ఎంతో ఇష్టపడతానన్న విక్రమ్
తమిళ స్టార్ విక్రమ్ నటించిన 'తంగలాన్' చిత్రం సూపర్ హిట్ అయింది. సినిమా సక్సెస్ వేడుకల్లో విక్రమ్ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన కెరీర్ ఆరంభంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో ఒక్కసారైనా నటించాలని కలలు కనేవాడినని చెప్పారు. మణిరత్నంను, ఆయన ఫిల్మ్ మేకింగ్ ను తాను ఎంతో ఇష్టపడతానని తెలిపారు. 

అప్పట్లో తనకు 'బొంబాయి' సినిమా ఆఫర్ వచ్చిందని, తనను హీరోగా ఎంచుకున్నారని విక్రమ్ చెప్పారు. అయితే ఫైనల్ ఆడిషన్ లో తాను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం చేజారిందని తెలిపారు. తనను సడన్ గా ఆడిషన్ కు పిలిచారని... వీడియో కెమెరా కాకుండా స్టిల్ కమెరా తీసుకొచ్చి... సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారని చెప్పారు. అయితే మూమూలు కెమెరా తీసుకొచ్చి యాక్ట్ చేయమంటారేమిటి? ఎందుకు యాక్ట్ చేయాలి? అనిపించిందని... స్టిల్ కెమెరా కావడంతో తాను కదిలితే పిక్చర్ బ్లర్ గా వస్తుందని తాను భావించి అలాగే ఉండిపోయానని తెలిపారు. ఆ విధంగా ఆ సినిమా తన చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పొరపాటుకు తాను 2 నెలల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత 'బొంబాయి' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిందని అన్నారు.


More Telugu News