ప్రాణం తీసిన మ‌నిషి దురాశ‌.. నీట మునిగిపోతున్న వ్య‌క్తిని కాపాడేందుకు రూ.10వేల డిమాండ్‌!

  • యూపీలోని ఉన్నావ్‌లో ఘ‌ట‌న‌
  • నానామావ్ ఘాట్ వద్ద స్నానానికి వెళ్లిన ప్ర‌భుత్వాధికారి ఆదిత్య వ‌ర్ధ‌న్ సింగ్‌
  • ఒక్క‌సారిగా నీటి ప్ర‌వాహం పెరగ‌డంతో నీట‌మునిగిన వైనం
  • కాపాడేందుకు గ‌జ ఈత‌గాడు సునీల్ క‌శ్య‌ప్ రూ.10 వేల డిమాండ్‌
  • ఆన్‌లైన్‌లో డ‌బ్బులు పంపించేలోపే నీటి‌లో మునిగి చ‌నిపోయిన సింగ్‌
గ‌జ ఈత‌గాడి దురాశ ఓ వ్య‌క్తి ప్రాణాన్ని బ‌లితీసుకున్న ఘ‌ట‌న యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదిత్య వర్ధన్‌ సింగ్‌ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్‌లోని నానామావ్‌ ఘాట్‌ వద్ద గంగా నదిలో స్నానానికి వెళ్లారు. 

అయితే, ఒక్క‌సారిగా ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు. దాంతో ఆదిత్య వ‌ర్ధ‌న్ మిత్రులు త‌మ‌కు ఈత రాక‌పోవ‌డంతో అక్క‌డే ఉన్న గ‌జ ఈత‌గాడు సునీల్ క‌శ్య‌ప్ సాయం కోరారు. అందుకు అత‌డు రూ. 10వేలు డిమాండ్ చేశాడు. అందుకు అంగీక‌రించిన స్నేహితులు త‌మ వ‌ద్ద క్యాష్ లేక‌పోవ‌డంతో ఆన్‌లైన్ చేస్తామ‌ని చెప్పారు. 

దాంతో ఆన్‌లైన్‌లో రూ.10వేలు తనకు బదిలీ అయ్యే వరకు తాను నీటిలో దూక‌బోనని చెప్పాడు. ఆదిత్య వ‌ర్ధ‌న్ నదిలో కొట్టుకుపోతూ ఉంటే.. తనకు రావాల్సిన న‌గ‌దు బదిలీ అయ్యే వరకు సునీల్ అలాగే వేచి చూశాడు. అయితే, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ అయ్యేలోపు అధికారి నీటిలో మునిగి చ‌నిపోయారు.


More Telugu News