టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొనగాడు ఎవరో తెలుసా?

క్రికెట్‌లో సిక్సర్లు బాదే ఆటగాళ్లకు బాగా క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రికెటర్లకు దేశాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, రోహిత్‌శర్మ వంటి పలువురు ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్లకు మారుపేరుగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ నెమ్మదిగా సాగే టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్లు బాదడం ప్రత్యేకమనే చెప్పాలి. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అతడు మొత్తం 131 సిక్సర్లు బాదాడు. అతడి తర్వాత స్థానాల్లో ఉన్నవారందరూ రిటైర్ అయిన క్రికెటర్లే కావడం గమనార్హం. టాప్-5లో ఒక్క భారతీయ క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల వీరులు వీళ్లే

1. బెన్ స్టోక్స్ - 131 సిక్సర్లు
2. బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) - 107 సిక్సర్లు
3. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 100 సిక్సర్లు
4. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 98 సిక్సర్లు
5. జాక్వెస్ కలిస్(దక్షిణాఫ్రికా) - 97 సిక్సర్లు


More Telugu News