రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు
- రాత్రంతా అధికారులతో కలిసి బోటులో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
- వరద బాధితులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు
- అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలో పర్యటించిన ముఖ్యమంత్రి
- త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి బోటులో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా బుడమేరు వరదతో అస్తవ్యస్తమైన సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి రెండోసారి పర్యటించడం గమనార్హం. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా రక్షణ గోడ వద్ద వరద నీటిని పరిశీలించారు.
త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని వరద బాధితులకు ధైర్యం చెప్పారు. అలాగే సింగ్ నగర్, కృష్ణలంక, ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని పరిశీలించారు. అక్కడి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబుపై పార్టీ శ్రేణులు, అభిమానులతో పాటు పలువురు సామాన్య ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చంద్రబాబుతో పాటు ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దే రామ్మోహన్, కృష్ణప్రసాద్, కలెక్టర్ సృజన, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.