ఏపీలో రేపు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు

  • గత రెండ్రోజులుగా ఏపీలో భారీ వర్షాలు, వరదలు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు... రెడ్ అలర్ట్ జారీ
  • రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తప్పవన్న చంద్రబాబు
ఏపీలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపు (సెప్టెంబరు 2) ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు కూడా రేపు సోమవారం నాడు విద్యాసంస్థలకు సెలవు అని అధికారికంగా ప్రకటించారు. ఆదేశాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

గత రెండ్రోజులుగా ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలు చోట్ల వరద బీభత్సం నెలకొంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 9 మంది మృతి చెందారు. ఒకరు గల్లంతయ్యారు.


More Telugu News