ఆగస్టు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!
- ఆగస్టులో రూ.1,74,962 కోట్ల జీఎస్టీ వసూలు
- గతేడాది ఆగస్టుతో పోల్చితే 10 శాతం వృద్ధి
- ఈ ఏడాది ఆగస్టు వరకు నికర జీఎస్టీ ఆదాయం రూ.8.07 లక్షల కోట్లు
ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం నేడు విడుదల చేసింది. ఆగస్టులో రూ.1,74,962 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే 10 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. 2023 ఆగస్టులో రూ.1,59,069 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వివరించింది.
ఆగస్టులో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.25 లక్షల కోట్లు, దిగుమతుల ద్వారా రూ.49,976 కోట్లు వసూలైనట్టు కేంద్రం పేర్కొంది.
కాగా, ఈ ఏడాది జులైలో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ ఏడాది ఆగస్టు వరకు నికర జీఎస్టీ ఆదాయం రూ.8.07 లక్షల కోట్లు కాగా, గతేడాదితో పోల్చితే ఇది 10.2 శాతం ఎక్కువ.