బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్నది బ్లూ మీడియా సృష్టి: మంత్రి నారా లోకేశ్
- గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు అంటూ ఇటీవల కలకలం
- ఎలాంటి ఆధారాలు లభించలేదన్న నారా లోకేశ్
- ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకం అంటూ విమర్శలు
ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్ రూంలో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ తీవ్ర కలకలం రేగింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించి, హాస్టల్ లో అణువణువు తనిఖీలు చేపట్టి, అక్కడేమీ లేదని తేల్చింది.
ఇదే అంశంపై ఇవాళ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్నది బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని విమర్శించారు. అక్కడ హిడెన్ కెమెరాలు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
సినీ నటిపై వైసీపీ నేతల వేధింపుల కేసు, మద్యం స్కాం, భూ అక్రమాలు బయటపడడం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.
జగన్ మాదిరిగా తాను తల్లిని, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసే రకం కాదని... విద్యార్థినులను తోబుట్టువులుగా భావిస్తానని, వారిని కంటికి రెప్పలా కాపాడతానని స్పష్టం చేశారు.