వరదలో చిక్కుకున్న బస్సు.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అందులోనే ప్రయాణికులు
- వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బస్సు
- నెక్కొండ శివారులో వరద నీటిలో చిక్కుకుపోయిన వైనం
- బస్సులో 40 మంది ప్రయాణికులు
- రాత్రంతా నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రయాణికులు
- ట్రాక్టర్ సాయంతో వారిని రక్షించి పాఠశాలలో షెల్టర్ కల్పించిన కలెక్టర్
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది.
తోపనపల్లి చెరువు పొంగడంతో బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అందులోని ప్రయాణికులు ఎటూ కదలలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అలాగే గడిపారు. తమను రక్షించాలని కోరుతూ బంధువులు, అధికారులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. రాతంత్రా నిద్రాహారాలు లేకుండా అలాగే గడిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఈ ఉదయం గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన అనంతరం వారిని వారి గమ్యస్థానాలకు చేరుస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.