పార్టీ మార్పు వార్తలపై తొలిసారి స్పందించిన వైసీపీ నేత రోజా

  • సోషల్ మీడియా ఖాతా నుంచి జగన్‌ను అన్‌ఫాలో చేసిన రోజా
  • ఇన్‌స్టాగ్రామ్ ఫ్రొఫైల్‌ మార్చి ఊహాగానాలకు తెరలేపిన మాజీ మంత్రి
  • ఆ వార్తలు ఊహాగానాలేనని స్పష్టీకరణ
  • పార్టీ మారబోవడం లేదని చెప్పిన వైసీపీ నేత
పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు. నటి రవళితో కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయని, కాలేజీ వాష్‌రూములలో కెమెరాలు పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారే నేతల వల్ల జగన్‌కు కానీ, వైసీపీకి కాని ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. 

రోజా ఇటీవల తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించడం, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను మార్చడంతో ఆమె పార్టీ మారబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. అంతేకాదు, పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని, తమిళనాడులోని ఓ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తొలిసారి పెదవి విప్పిన రోజా.. పార్టీ మార్పు వార్తలు ఊహాగానాలేనని, వాటిలో నిజం లేదంటూ స్పష్టతనిచ్చారు.


More Telugu News