నందిగామలో పొంగిన వాగు... హైదరాబాద్-విజయవాడ వాహనాలు దారి మళ్లింపు
- కొన్నిరోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు
- నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు
- వాహనాలను దారి మళ్లించడంతో కోదాడ వద్ద ట్రాఫిక్ జామ్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగుతుండటంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు. ఈ రోడ్డు నిత్యం వాహనాలతో హడావుడిగా కనిపిస్తుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ వద్ద వాగు పొంగింది. జాతీయ రహదారి పైకి నీరు చేరింది. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారికి మళ్లించారు. దీంతో కోదాడ - జగ్గయ్యపేట మధ్య ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారికి మళ్లించారు. దీంతో కోదాడ - జగ్గయ్యపేట మధ్య ట్రాఫిక్ జామ్ అయింది.