కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి... రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- విజయవాడలో భారీ వర్షాలు
- మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మేఘన, లాలు, బోలెం లక్ష్మి, అన్నపూర్ణ అనే వ్యక్తులు మరణించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
విజయవాడలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ లో ఈ ఉదయం కొండచరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి.
కాగా, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.