ఆ ఆరుగురు అధికారులపై హైడ్రా ఫిర్యాదు... కేసులు నమోదు చేసిన పోలీసులు

  • అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఫిర్యాదు
  • కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు
  • హైడ్రా సిఫారసు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడి
హైదరాబాద్ నగర పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు తీసుకుంది. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు... సదరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందాపేట జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్, బాచుపల్లి తహసీల్దారు పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్‌పై కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫారసు మేరకు అధికారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.


More Telugu News