కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకుంటాం: చంద్రబాబు

  • ఎమర్జెన్సీలో డ్రోన్లు వాడాలంటూ అధికారులకు సూచన
  • ఏపీలో వర్షాలపై అధికారయంత్రాంగంతో ముఖ్యమంత్రి సమీక్ష
  • ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారయంత్రాంగంతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు.

వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా పరిస్థితికి అనుగుణంగా దారి మళ్లించాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలకు టెక్నాలజీ వాడుకోవాలని, వాట్సాప్ గ్రూపులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లను ఉపయోగించాలని సూచించారు.


More Telugu News