కవిత ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు... చర్యలు తీసుకోండి: బీఆర్ఎస్వీ ఫిర్యాదు

  • కాంగ్రెస్ సోషల్ మీడియా, నాయకుల అధికారిక ఖాతాల్లో మార్ఫింగ్ ఫొటోలు ఉన్నాయని ఫిర్యాదు
  • డీసీపీ దార కవితను కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వీ నేతలు
  • అబద్ధపు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అనంతరం తుంగ బాలు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, పార్టీ నాయకులు, అధికారిక ఖాతాలలో కవిత ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

కవిత ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ ఆమె కీర్తిప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులకు సంబంధించి డీసీపీ దార కవితను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి ఖాతాలోని పోస్టులను తొలగించాలని డీసీపీని కోరామన్నారు. ఇలాంటి అబద్ధపు ప్రచారం చేస్తే బీఆర్ఎస్వీ విభాగం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.


More Telugu News