ఆయనకు ఎన్నో పదవులు ఇచ్చాం... పార్టీ మారితే విలువ ఉండదు: అయోధ్య రామిరెడ్డి

  • 10 మంది రాజ్యసభ సభ్యులు వెళ్లిపోతున్నారనే వార్తల్లో నిజం లేదన్న రామిరెడ్డి
  • ఒకరిద్దరు పోయినంత మాత్రాన నష్టం లేదని వ్యాఖ్య
  • తాను పార్టీ వీడే ప్రసక్తే లేదన్న రామిరెడ్డి
వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ ఉండదని చెప్పారు. వాళ్లు స్వలాభం కోసం వెళితే... తాము పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తామని అన్నారు. 

పదవి అంటే బాధ్యత, త్యాగంతో కూడుకున్నదని చెప్పారు. ఈ రోజుల్లో పార్టీలను నడపడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు. అన్నీ అనుకున్నట్టే జరగాలనుకుంటే రాజకీయాల్లో కుదరదని చెప్పారు. 

తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని రామిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా జగన్ వెంటే ప్రయాణం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మోపిదేవికి ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ వంటి పదవులు ఇచ్చామని... ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పార్టీ మారితే విలువ ఉండదని అన్నారు. 

తమ వ్యక్తిత్వాలను దెబ్బతీసే వార్తలు రాసి, తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. సామాన్యుల కోసం ఆలోచించే వ్యక్తి జగన్ అని... వాళ్ల కోసమే జగన్ పార్టీ పెట్టారని చెప్పారు.


More Telugu News