టీటీడీ మాదిరి యాదగిరిగుట్టకు కూడా ప్రత్యేక బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి

  • టూరిజంపై నూతన విధానాన్ని రూపొందించాలన్న రేవంత్
  • ఎకో, టెంపుల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
  • హైదరాబాద్ వెలుపల మరో జూపార్క్ అభివృద్ధికి ప్లాన్ తయారు చేయాలని ఆదేశం
తెలంగాణలో ఇప్పటికే పలు అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టూరిజంపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై నూతన విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట (యాదాద్రి) అభివృద్ధిపై కీలక ఆదేశాలను ముఖ్యమంత్రి జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మాదిరి యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పారు. 

ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని చెప్పారు. ఆలయ అభివృద్ధి పెండింగ్ పనులు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనుల వివరాలను ఇవ్వాలని సూచించారు.


More Telugu News