చంద్రమోహన్ గారికి ఎదురైన పెద్ద ప్రమాదం అది: భార్య జలంధర

  • చంద్రమోహన్ గొప్ప నటుడన్న జలంధర 
  • 'పదహారేళ్ల వయసు' సినిమా అంటే ఇష్టమని వెల్లడి 
  • ఆయన సాహసాలు చేసేవారని వ్యాఖ్య 
  • పెద్ద ప్రమాదాలు తప్పిపోయానని వివరణ   

చంద్రమోహన్ .. కొన్ని దశాబ్దాల పాటు తెరపై ఒక వెలుగు వెలిగిన నటుడు. హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి చంద్రమోహన్ గురించి, 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భార్య జలంధర ప్రస్తావించారు. చంద్రమోహన్ గారి వాళ్లది కళాకారుల కుటుంబం .. అందువలన ఆయనకీ సంగీతం పట్ల .. నటన పట్ల ఆసక్తి పెరిగింది" అని అన్నారు. 

చంద్రమోహన్ గారు 45 సినిమాల వరకూ చేసిన తరువాత మా పెళ్లి అయింది. ఆ తరువాత ఆయన వరుసగా హిట్ సినిమాలు చేస్తూ వెళ్లారు. ఆయన నటించిన సినిమాలలో 'పదహారేళ్ల వయసు' .. 'సీతామాలక్ష్మీ' .. 'కలికాలం' అంటే ఇష్టం. చంద్రమోహన్ గారు సినిమా షూటింగు సమయంలో దేనికీ భయపడేవారు కాదు. ఒకసారి షాట్ కోసం నిజం నూతిలోకి దూకేశారు. ఆ తరువాత అక్కడివాళ్లు దూకి ఆయనను కాపాడారు" అని అన్నారు. 

ఒక సినిమాను షూటింగు గోదావరి తీరంలో జరుగుతోంది. గోదావరిలో కొట్టుకుపోతున్న బ్యాగ్ ను చంద్రమోహన్ గారు తీసుకుని రావాలి. షాట్ లో ఆయన ఈదుకుంటూ వెళుతూనే ఉన్నారు. ఆయన సుడిగుండం వైపు వెళుతుండటం కెమెరా మెన్ చూసి అరుస్తున్నాడటగానీ ఆయనకి వినిపించలేదు. అదే సమయంలో షూటింగు చూస్తున్న ఆ గ్రామస్తుడు ఈదుకుంటూ వెళ్లి ఆయనను రక్షించాడు. ఇలా ఆయనకి చాలా ప్రమాదాలే ఎదురయ్యాయి" అని చెప్పారు. 



More Telugu News