పాకిస్థాన్‌తో చర్చలు జరిపే అంశంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్న జైశంకర్
- పాక్‌కు తగిన విధంగా బదులిస్తామన్న విదేశాంగ మంత్రి
- జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ముగిసిన కథ అన్న జైశంకర్
పాకిస్థాన్‌తో చర్చలు జరిపే అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందని ఆయన స్పష్టం చేశారు.
పాక్ మనతో ఎలా వ్యవహరిస్తే మనమూ ఆ దేశంతో అలాగే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. పాక్‌కు తగిన విధంగా బదులిస్తామన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ముగిసిన కథ అని వ్యాఖ్యానించారు.
జర్మనీలోని దంపతులకు జైశంకర్ హామీ
జర్మనీలో థానేకు చెందిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. భౌతికంగా హింసించారనే ఆరోపణలతో వీరి కూతురిని జర్మనీ ప్రభుత్వం సంరక్షణ కేంద్రానికి తరలించింది. ఆ చిన్నారి 36 నెలలుగా అక్కడే ఉంటోంది. ఈ విషయాన్ని ఆ తల్లిదండ్రులు స్థానిక ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన కేంద్రమంత్రికి తెలియజేశారు. ఆ చిన్నారిని, తల్లిదండ్రులను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు రప్పిస్తామని జైశంకర్ హామీ ఇచ్చారు.