స్పైస్‌జెట్ కీలక నిర్ణయం.. సిబ్బందికి 3 నెలల సెలవులు.. నో శాలరీ!
- పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో స్పైస్‌జెట్
- 150 మంది క్యాబిన్ సిబ్బందిని 3 నెలల పాటు సెలవుల్లో పంపించినట్లు ప్రకటన
- ఈ 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయం
లోబడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిసారించింది.
దీనిలో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. గురువారం 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు సెలవుల్లో పంపించినట్లు ప్రకటించింది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ఈ కష్ట సమయంలో సహకరిస్తున్న సిబ్బందికి సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఫర్‌లాఫ్ సమయంలోనూ ఉద్యోగుల అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవుల సదుపాయం అలాగే ఉంటాయని పేర్కొంది.
ఇక గత నెలలో స్పైస్‌జెట్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా రూ. 3,000 కోట్లను సమీకరించే ప్రక్రియను ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతుంది. అటు 2024 ప్రారంభంలో ఎయిర్‌లైన్ వాటాదారులు రూ. 2,241 కోట్లను సమీకరించడానికి ఈక్విటీ, వారెంట్‌ల జారీని ఆమోదించారు. అయితే, అందులో కేవలం రూ. 1,060 కోట్లు మాత్రమే పోగు అయ్యాయి.
ఇదిలాఉంటే.. స్పైస్‌జెట్ చివరిసారిగా 2017-18లో మాత్రమే రూ. 557.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఆ తర్వాత ఆరేళ్ల నుంచి వరుసగా నష్టాలనే చవిచూస్తోంది.