11 మంది ఆటగాళ్లతో ఆల్-టైమ్ టీమ్‌ను ప్రకటించిన అశ్విన్.. కెప్టెన్ ఎవరో తెలుసా?
- కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని ఎంచుకున్న దిగ్గజ స్పిన్నర్
- ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ ఎంపిక
- 11 మందిలో ఏడుగురు భారత ఆటగాళ్లకే చోటు
టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ జట్టుని ప్రకటించాడు. ఈ టీమ్‌లో ఏడుగురు భారతీయ క్రికెటర్లే ఉన్నారు. ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్య్రూ రస్సెల్, గౌతమ్ గంభీర్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు ఇవ్వని అశ్విన్.. నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్లను జట్టులోకి తీసుకున్నాడు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే టీమ్‌లోకి తీసుకున్నాడు.
అయితే కెప్టెన్సీ విషయంలో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అశ్విన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఆల్ టైమ్ గ్రేట్ ఎంఎస్ ధోనీని తన జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు కూడా అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ ‘మిస్టర్ కూల్’ ధోనీ వైపే అశ్విన్ మొగ్గుచూపాడు.
ఐపీఎల్‌లో తమతమ ఫ్రాంచైజీలకు చాలా కాలంగా ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీలను ఓపెనింగ్ జోడీగా అశ్విన్ ఎంపిక చేశాడు. 3వ స్థానంలో బ్యాటింగ్‌కు సురేష్ రైనాను, 4వ స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌లను ఎంపిక చేశారు. ఇక 5వ స్థానంలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివీలియర్స్, 6వ స్థానంలో ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. కీపర్, కెప్టెన్‌గా ధోనీ పేరుని అశ్విన్ పేర్కొన్నాడు.
ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే సునీల్ నరైన్, రషీద్ ఖాన్‌లను ఎంపిక చేశాడు. వీరిద్దరూ ప్రపంచ స్థాయి స్పిన్నర్లు మాత్రమే కాదు.. బ్యాటింగ్ కూడా చేయగల సమర్థులు కావడంతో అశ్విన్ ఎంపిక చేశాడు. ముగ్గురు పేసర్లకు జట్టులో చోటిచ్చాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగాతో పాటు భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు పేర్లను పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ‘చీకీ చీకా’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ తన జట్టుని వెల్లడించాడు.
అశ్విన్ ఆల్-టైమ్ ఐపీఎల్ తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ (కీపర్, కెప్టెన్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.