తీరు మారని నటుడు దర్శన్.. సన్ గ్లాసెస్, టీషర్ట్‌తో బళ్లారి జైలుకు!
- బెంగళూరు పరప్పన జైలు నుంచి బళ్లారి జైలుకు నటుడు దర్శన్
- బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్ట్, సన్‌గ్లాసెస్‌తో జైలుకు
- అనుమతించిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు
జైలు మారినా నటుడు దర్శన్ తూగుదీప తీరు మాత్రం మారడం లేదు. 33 ఏళ్ల ఆటో డ్రైవర్ రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితుడైన దర్శన్‌కు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో రాజభోగాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయనను అక్కడి నుంచి నిన్న బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించింది. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్ట్ ధరించి, దానికి సన్‌గ్లాసెస్ వేలాడదీసి బళ్లారి జైలులోకి వెళ్తున్న దర్శన్ ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడిని అందుకు అనుమతించిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.
పోలీసులు మాత్రం అవి చలువ అద్దాలు కావని, పవర్ గ్లాసులని అంటున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న అండర్ ట్రయల్ ఖైదీలు, నిందితులు వాటిని పెట్టుకునేందుకు అనుమతిస్తామని, అది నేరం కాదని వివరణ ఇచ్చారు. మరోపక్క, సన్‌గ్లాసెస్ లాంటి కూలింగ్ కళ్లద్దాలు ధరించవచ్చని జైలు నోటీసు పేర్కొంటోంది. అయినప్పటికీ, పోలీసులు మాత్రం దర్శన్ ధరించినవి పవర్ గ్లాసెస్ అని చెబుతుండడం గమనార్హం.
ఇప్పటి వరకు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్ ఇటీవల జైలు లాన్‌లో ఓ రౌడీషీటర్ సహా కొందరితో కలిసి కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ బాతాఖానీ కొడుతున్న ఫొటో, వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. జైలులో అతడికి లభిస్తున్న రాచమర్యాదలపై విమర్శలు రావడంతో బెంగళూరు కోర్టు అనుమతితో బళ్లారికి జైలుకు తరలించింది.