ఎల్జీబీటీక్యూ సమాజానికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఆంక్షలు లేకుండానే బ్యాంకు ఖాతా!
- ఉమ్మడి ఖాతాను ప్రారంభించడం, నామినేట్ చేయడంలో ఆంక్షలు ఉండబోవన్న కేంద్రం
- సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉదహరించిన ప్రభుత్వం
- ఆర్‌బీఐ సహా అన్ని బ్యాంకులకు స్పష్టత నిచ్చిన ఆర్థిక మంత్రిత్వశాఖ
ఎల్జీబీటీక్యూ సమాజానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్యాంకు ఖాతాల విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. ఉమ్మడి ఖాతాను ప్రారంభించడంలో కానీ, తమకు సంబంధించిన వ్యక్తిని నామినేట్ చేయడంలో కానీ ఆంక్షలు ఉండవని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో 17 అక్టోబర్ 2023లో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉటంకించింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు ఇందుకు సంబంధించి స్పష్టత నిచ్చినట్టు కేంద్రం తన అడ్వైజరీలో పేర్కొంది.
బ్యాంకు ఖాతాను తెరవడానికి, అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవడంలో సాయం చేసేందుకు ట్రాన్స్‌జెండర్లు అన్ని ఫారమ్‌లు, అప్లికేషన్లలో థర్డ్ జెండర్ అని ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని 2015లో అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. 2022లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ‘రెయిన్‌బో సేవింగ్స్ ఖాతా’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అధిక పొదుపు రేట్లు, డెబిట్ కార్డు ఆఫర్ సహా పలు ఫీచర్లు అందించింది.
17 అక్టోబర్ 2023 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎల్‌బీటీక్యూ ప్లస్ కమ్యూనిటీకి సంబంధించి వివిధ సమస్యలను పరిశీలించేందుకు కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.