తెలంగాణలో 3 రోజులు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ!
- నేటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- రాష్ట్రంలోని 4 నుంచి 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశాలున్నయన్న వాతావరణ శాఖ
- ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 4 నుంచి 11 జిల్లాల్లో ఇలా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడొచ్చని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..
ఇవాళ: ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల
రేపు: కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్
ఎల్లుండి: జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, యాదాద్రి, కామారెడ్డి, మెదక్