కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు... మహిళా కమిషన్ ఆగ్రహం
- రైతుల నిరసన వెనుక విదేశీ కుట్ర ఉందన్న కంగనా రనౌత్
- కంగనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ ఎంపీ
- మహిళను అవమానించినందుకు చర్యలు తీసుకుంటామన్న మహిళా కమిషన్
బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్‌పై మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత ఏడాది రైతుల నిరసన వెనుక విదేశీ కుట్ర ఉందంటూ కంగన వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల మీద పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మాటలు పునరావృతం కావొద్దని హెచ్చరించింది.
ఈ క్రమంలో ఆమెపై పంజాబ్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం ఎలా జరుగుతుందో మీరు ఆమెను (కంగన) అడగాలని, అప్పుడు ప్రజలకూ వివరించవచ్చునని, అత్యాచార విషయాల్లో ఆమెకు చాలా అనుభవం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలను పంజాబ్ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మహిళను అవమానించారని, ఇందుకు తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మాజీ ఎంపీ వ్యాఖ్యలపై కంగన బృందం స్పందిస్తూ... అత్యాచారాలను చిన్న చూపు చూడటం సర్వ సాధారణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.