సరికొత్త గరిష్ఠాలను తాకిన భారత స్టాక్ మార్కెట్

  • 349 పాయింట్లు ఎగిసి 82,134 వద్ద స్థిరపడిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు లాభపడి 25,152 వద్ద స్థిరపడిన నిఫ్టీ
  • 52 వారాల గరిష్ఠాలను తాకిన 300 స్టాక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. సూచీలు కొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 82,134, నిఫ్టీ 99 పాయింట్లు ఎగిసి 25,152 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. గ్రాసీమ్ ఇండస్ట్రీస్, మహింద్రా అండ్ మహింద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.3 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం నష్టపోయింది. అయితే ఆటో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, టెలికాం, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, 0.5 శాతం నుంచి 1 శాతం మేర లాభపడ్డాయి. అదే సమయంలో క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, మీడియా, మెటల్, పవర్ రంగాలు 0.3 శాతం నుంచి 0.7 శాతం వరకు నష్టపోయాయి.

ఈరోజు బీఎస్ఈలో దాదాపు 300 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాలను తాకాయి. ఇందులో బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి వెయిటేజీ కంపెనీల షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.


More Telugu News