టీడీపీ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు.. షోకాజ్ నోటీసులతో ఝ‌ల‌క్‌ ఇచ్చిన ఎస్‌పీ!

  • చిలకలూరిపేట పోలీసులకు ఎస్‌పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు
  • ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బ‌ర్త్ డే వేడుకల్లో పాల్గొన్న‌ పోలీసులు
  • అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్‌పీ ఆగ్రహం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులకు ఎస్‌పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బ‌ర్త్ డే వేడుకల్లో పోలీసులు పాల్గొన‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. 

చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేష్‌, ఎసైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్‌ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్‌పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News