ప్లీజ్.. నన్ను కలిసేందుకు రావద్దు.. కార్యకర్తలకు కవిత రిక్వెస్ట్
- పది రోజుల పాటు ఎర్రవెల్లి ఫాంహౌస్ లోనే ఉంటానని వెల్లడి
- ఆ తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని వివరణ
- గురువారం ఉదయం ఫాంహౌస్ కు బయలుదేరి వెల్లిన ఎమ్మెల్సీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు ఐదున్నర నెలల పాటు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం సాయంత్రం బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న కవిత.. గురువారం ఉదయం ఎర్రవెల్లిలోని తండ్రి కేసీఆర్ ఫాంహౌస్ కు బయలుదేరి వెళ్లారు. బంజారాహిల్స్ లోని తన నివాసం వద్దకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు.
పది రోజుల పాటు ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఈ పది రోజులు తనను డిస్టర్బ్ చేయొద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని అభిమానులు, కార్యకర్తలకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అభిమానులు సహకరించాలని కోరారు. పది రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. మరికాసేపట్లో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కవిత భేటీ కానున్నారు.