శ్రీలంక వెళ్లాలి అనుకునే వారికి శుభవార్త.. ఇకపై ఆ దేశానికి ఉచిత వీసా
- భారత్ సహా 35 దేశాల వారికి వీసా ఫ్రీ ఎంట్రీ
- జాబితాలో చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, జపాన్, ఫ్రాన్స్
- అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి
శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు పొరుగు దేశం తీపి కబురు చెప్పింది. భారత పౌరులకు ఆరు నెలల పాటు ఉచిత వీసా సౌకర్యం కల్పించింది. భారత్ సహా 35 దేశాల వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
ప్రధానంగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జపాన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలు ఉచిత వీసా జాబితాలో ఉన్నాయి. మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.