నాగచైతన్య, శోభిత విషయంలో వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులపై వేణుస్వామికి హైకోర్టులో ఊరట
- నాగ చైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ను ప్రశ్నించిన హైకోర్టు
- మహిళా కమిషన్ నోటీసులు చెల్లుబాటు కావని స్పష్టం చేసిన హైకోర్టు
సినీ సెలబ్రిటీలు, రాజకీయ పార్టీలపై జోస్యాలు చెబుతూ పాప్యులర్ అయిన అస్ట్రాలజర్ వేణుస్వామికి ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై వేణుస్వామికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల నాగచైతన్య, శోభిత నిశ్చితార్థ వేడుకలు జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే వేణుస్వామి వారి వైవాహిక జీవితంపై సంచలన జోస్యం చెప్పారు. 2027వరకే వారు కలిసి ఉంటారని తర్వాత విడిపోతారంటూ వేణుస్వామి ఒక వీడియో విడుదల చేశారు. వేణుస్వామి ఈ రకంగా జోస్యం చెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
అయితే ఆయన చెప్పిన జోస్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ మహిళా కమిషన్ కు వేణుస్వామిపై ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నుండి విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. వేణుస్వామి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.