ఇది చదివితే తారక్ కు హ్యాట్సాఫ్ చెబుతారు!

  • అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన తారక్
  • 11 ఏళ్లుగా దివంగత అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటున్న వైనం
  • బాద్ షా మూవీ మ్యూజిక్ ఫంక్షన్  సమయంలో జరిగిన తొక్కిసలాటలో రాజేంద్ర ప్రసాద్ అనే అభిమాని మృతి
ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ (తారక్) చేస్తున్న ఒక పని తెలిస్తే ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెబుతారు. సౌత్ హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్న తారక్ .. పాన్ ఇండియాలోనూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ ఓ అభిమాని కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వస్తున్న ఆయన మానవత్వానికి హ్యాట్సాప్ అనాల్సిందే. ఇంతకూ తారక్ చేస్తూ వచ్చిన అంత మంచి పని ఏమిటంటే..

2013లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా బాద్ షా మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజు అనే అభిమాని మృతి చెందాడు. ఈ ఘటన జూనియర్ ఎన్టీఆర్ ను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సదరు బాధిత కుటుంబాన్ని కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అభిమాని కుటుంబ బాధ్యతను తాను భుజానవేసుకున్నారు. 11 ఏళ్లుగా ఆ కుటుంబానికి తారక్ ఆర్థికంగా అండగా నిలిచారు.


More Telugu News