ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్లు... సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • ఈసారి ఆగస్టు 31నే పెన్షన్ పంపిణీ
  • సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో చంద్రబాబు కీలక నిర్ణయం
  • ఏదైనా కారణంతో పెన్షన్ తీసుకోని వారికి సెప్టెంబరు 2న అందజేత
ఏపీలో ఈ నెలాఖరుకే (ఆగస్టు 31) పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాధారణంగా సామాజిక పెన్షన్లను ప్రతి నెల 1వ తారీఖు ఇస్తుంటారు. అయితే, 1వ తారీఖు నాడు ఆదివారం రావడంతో, పెన్షన్లను ఒకరోజు ముందే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒకవేళ, ఏదైనా కారణంతో పెన్షన్లు తీసుకోని వారికి సెప్టెంబరు 2వ తేదీ (సోమవారం) ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. 

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సామాజిక పెన్షన్ ను రూ.4 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అటు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా పెన్షన్ ను పెంచారు.


More Telugu News