నేను జగన్ తోనే ఉంటా: విజయసాయిరెడ్డి
- ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ
- వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసలు
- త్వరలోనే విజయసాయిరెడ్డి జంప్ అంటూ కథనాలు
- ఖండించిన విజయసాయిరెడ్డి
ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో, వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. త్వరలోనే వైసీపీ ఖాళీ అంటూ కథనాలు వస్తున్నాయి. అంతేకాదు, అగ్రనేత విజయసాయిరెడ్డి సైతం పార్టీని వీడనున్నారని, మరో పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు.
"నేను వైసీపీ పట్ల విధేయతతో, అంకితభావంతో, నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉంటానని స్పష్టంగా వెల్లడిస్తున్నాను. నేను వైసీపీతోనే ఉంటా... జగన్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా. నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, మరో పార్టీలో చేరుతున్నానని మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తున్న నిరాధారమైన తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నాను" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.