టాప్ త్రీ లోని భామల జోరు తగ్గినట్టే!
- భారీ ఫ్లాపులతో వెనుక బడిన పూజ హెగ్డే
- 'పుష్ప 2'తో పుంజుకునే ప్రయత్నాల్లో రష్మిక
- 'దసరా' తరువాత తగ్గిన కీర్తి సురేశ్ దూకుడు
- టాప్ త్రీ రేసులోకి చేరలేకపోతున్న ఇతర హీరోయిన్స్
టాలీవుడ్ లో టాప్ త్రీ జాబితాలో కనిపించే హీరోయిన్స్ ఎవరని అడిగితే, పూజా హెగ్డే .. రష్మిక మందన .. కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తాయి. హిట్లు .. ఫ్లాపులు .. ఏవరేజులు .. ఇలా ఎలా చూసుకున్నా చాలా కాలంగా ఈ ముగ్గురు భామలే టాప్ త్రీ జాబితాలో కనిపిస్తూ వస్తున్నారు. ఇక ఈ ముగ్గురిలో మొదటి ఇద్దరికీ బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కీర్తి సురేశ్ కి మాత్రం తమిళనాట మంచి ఇమేజ్ ఉంది.
పూజ హెగ్డే విషయానికే వస్తే, ఆమెకి ఎంతగా వరుస హిట్లు పడుతూ వచ్చాయో, అంతే వేగంగా పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. పైగా ఆ ఫ్లాప్ సినిమాలన్నీ పాన్ ఇండియావి కావడంతో ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడింది. 'ఆచార్య' తరువాత హీరోయిన్ గా ఆమె ఇంతవరకూ తెలుగు తెరపై కనిపించలేదు. హిందీ .. తమిళ ప్రాజెక్టులు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. రష్మిక విషయానికి వస్తే .. 'పుష్ప' తరువాత ఆమె చేసిన 'సీతారామం' .. 'వారసుడు' .. 'యానిమల్' సినిమాలు ఆమెకి కలిసొచ్చాయి. 'సీతారామం'లో ఆమె హీరోయిన్ కాదు .. 'వారసుడు'లో ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. అయినా కెరియర్ ఆశాజనకంగానే ఉంది. 'పుష్ప 2' తరువాత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కీర్తి సురేశ్ పరిస్థితి కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఉంది. 'దసరా' తరువాత తమిళంలో చేసిన సినిమాలే ఆమెకి కలిసొచ్చాయి. తెలుగుకి సంబంధించి ఆమె నుంచి ఇప్పట్లో వచ్చే సినిమాలైతే లేవు. తమిళ .. హిందీ సినిమాలు మాత్రం ఉన్నాయి. కొంతకాలంగా ఇక్కడ ఈ ముగ్గురు భామల జోరైతే తగ్గింది. వాళ్ల తరువాత స్థానాల్లో ఎవరున్నారనే ప్రశ్నకు కూడా ప్రస్తుతం సమాధానం దొరకని పరిస్థితే ఉంది.
పూజ హెగ్డే విషయానికే వస్తే, ఆమెకి ఎంతగా వరుస హిట్లు పడుతూ వచ్చాయో, అంతే వేగంగా పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. పైగా ఆ ఫ్లాప్ సినిమాలన్నీ పాన్ ఇండియావి కావడంతో ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడింది. 'ఆచార్య' తరువాత హీరోయిన్ గా ఆమె ఇంతవరకూ తెలుగు తెరపై కనిపించలేదు. హిందీ .. తమిళ ప్రాజెక్టులు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి.