కోట్లాది మందికి గౌర‌వం క‌ల్పించిన‌ 'జన్ ధన్'కు ప‌దేళ్లు.. ప్ర‌ధాని మోదీ స్పెష‌ల్ ట్వీట్‌!

  • 2014లో 'జ‌న్ ధ‌న్ యోజ‌న' ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ ఎన్‌డీఏ ప్రభుత్వం
  • ఈ ఏడాది ఆగ‌స్టు 14 నాటికి 53.1 కోట్ల‌కు చేరిన లబ్ధిదారుల సంఖ్య 
  • అలాగే 2.3 ట్రిలియన్ రూపాయ‌లు దాటిన డిపాజిట్లు
దేశంలో ఆర్థిక స‌మ్మిళిత‌త్వం పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి గౌర‌వం క‌ల్పించిన 'జ‌న్ ధ‌న్ యోజ‌న' ప‌థ‌కానికి ప‌దేళ్లు పూర్తయ్యాయంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా గుర్తు చేశారు. 

"ఈ రోజు ఇదో అద్భుత సంద‌ర్భం. జ‌న్‌ధ‌న్ యోజ‌న‌కు ప‌దేళ్లు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు. జన్ ధన్ యోజన ఆర్థిక స‌మ్మిళిత‌త్వాన్ని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి, ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ ప‌థ‌కం కీల‌కంగా మారింది" అని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కాగా, 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం.. పొదుపు ఖాతాలు, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెన్షన్‌ల వంటి ఆర్థిక సేవలను సరసమైన ధరలకు అందించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాది ఆగ‌స్టు 14 నాటికి ఈ ప‌థ‌కంలోని లబ్ధిదారుల సంఖ్య 53.1కోట్ల‌కు చేరింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు 300 మిలియన్ల మంది మహిళలు ఉండ‌డం విశేషం. అలాగే డిపాజిట్లు 2.3 ట్రిలియన్ రూపాయ‌లు దాటాయి.


More Telugu News