పనిమనిషిపై చోరీ కేసు పెట్టేందుకు వెళ్లిన యజమానికి షాక్
- ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- పనిమనిషి రూ. 15 వేలు చోరీ చేసిందని ఫిర్యాదు
- అదుపులోకి తీసుకుని విచారించగా అత్యాచారం ఘటన వెలుగులోకి
- బయటకు చెబితే తన భర్తను, బిడ్డను చంపేస్తానని బెదిరించాడన్న మహిళ
- వ్యాపారిపై కేసు నమోదు చేసి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
తన ఇంట్లో పనిచేస్తున్న 27 ఏళ్ల మహిళ రూ. 15 వేలు చోరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని అత్యాచారం కేసులో బుక్కయ్యాడు. ముంబైలో జరిగిందీ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 55 ఏళ్ల నగల వ్యాపారి ఒకరు తన ఇంట్లో పనిచేస్తున్న మహిళ రూ. 15 వేలు చోరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
ఫిబ్రవరి నుంచి తాను వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్నానని, ఇంట్లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు వేధించేవాడని, ఆయన భార్య లేనప్పుడు బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. అంతేకాదు, ఈ విషయాన్ని బయటపెడితే తన భర్తను, బిడ్డను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం చేసినా తాను తిరస్కరించినట్టు వివరించింది. దీంతో వ్యాపారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.