వరుసగా రెండో రోజు కూడా 25 వేలకు ఎగువన ముగిసిన నిఫ్టీ
- అంతర్జాతీయంగా మిశ్రమ సెంటిమెంట్లు
- ప్రాఫిట్ బుకింగ్ కు దిగిన ఇన్వెస్టర్లు
- ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల, ప్రతికూల సెంటిమెంట్ల ప్రభావం భారత మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 13.65 పాయింట్ల వృద్ధితో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు కూడా నిఫ్టీ 25 వేలకు ఎగువన ముగియడం విశేషం.
కాగా, నేటి ట్రేడింగ్ పై నిపుణులు స్పందిస్తూ, మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో సూచీలు ఫ్లాట్ గా ముగిశాయని వివరించారు. సెప్టెంబరులో వడ్డీ రేట్ల సవరణ ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఓవైపు, అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, భౌగోళిక సంక్షోభాలు మరోవైపు స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను శాసించాయని పేర్కొన్నారు.
ఇక, ఇవాళ్టి ట్రేడింగ్ లో బజాజ్ ఫిన్ సెర్వ్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్ షేర్లు లాభాలు అందుకున్నాయి.
టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ యూఎల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి.