అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా

  • మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్డు ప్రకంపనలు
  • నైతిక బాధ్యత వహిస్తూ మోహన్ లాల్ రాజీనామా
  • మోహన్ లాల్ తో పాటు 17 మంది సభ్యుల రాజీనామా
  • మరో రెండు నెలల్లో నూతన కార్యవర్గం కోసం ఎన్నికలు 
మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజీనామా చేశారు. అసోసియేషన్ కు చెందిన మొత్తం 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. 

జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో... మలయాళ చిత్ర పరిశ్రమలో పలువురు అగ్ర నటులు, స్టార్ డైరెక్టర్లు గతంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు సిద్ధిఖ్, దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై ఆరోపణలు వచ్చాయి. 

ఇన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో జరిగిన ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ మోహన్ లాల్ కార్యవర్గం రాజీనామా చేసినట్టు AMMA నుంచి ఓ ప్రకటన వెలువడింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి నూతన AMMA కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఆ ప్రకటనలో వివరించారు.


More Telugu News