ఎస్బీఐ ఏటీఎం సెంటర్ కు తాళం.. కరీంనగర్ లో ఘటన
- రెంట్ కట్టకపోవడంతో తాళం వేసుకున్నానంటూ ఓనర్ నోటీసు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు
- ఏటీఎం సెంటర్ రెంట్ కట్టే స్థితిలో లేదా అంటూ నెటిజన్ల కామెంట్లు
నెల నెలా రెంట్ సరిగా కట్టకుంటే ఇంటి ఓనర్ ఖాళీ చేయించడం చూసుంటారు.. ఇంటికి తాళం వేసుకుని రెంట్ ఇస్తే తప్ప కీ ఇవ్వననే ఓనర్లనూ చూసుంటారు.. స్టూడెంట్లు, బ్యాచ్ లర్లు ఉండే రూమ్ ల విషయంలో ఇలాంటి ఘటనలు సాధారణమే కానీ కరీంనగర్ లో ఓ వ్యక్తి ఏకంగా ఎస్బీఐ అధికారులకే షాకిచ్చాడు. తన షాప్ రెంట్ కు తీసుకుని ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారని, కొంతకాలంగా రెంట్ కట్టడంలేదని ఆరోపిస్తూ సదరు ఏటీఎం సెంటర్ కు తాళం వేశాడు. డోర్ పైన ‘అద్దె కట్టకపోవడంతో ఈ ఏటీఎం సెంటర్ కు తాళం వేయడమైనది’ అంటూ బ్యాంకు పరిభాషలోనే ఓ నోటీసు కూడా అంటించాడు.
అద్దె కోసం ఎప్పుడు బ్యాంకుకు వెళ్లినా అధికారులు రేపు, మాపు అంటూ తిప్పుతున్నారని మండిపడ్డాడు. నగదు విత్ డ్రా చేయడానికి వెళ్లిన కస్టమర్లు ఏటీఎం సెంటర్ కు తాళం వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆపై యజమాని అంటించిన నోటీసు చూసి.. కోట్లాది మంది కస్టమర్లు, నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు చేసే ఎస్బీఐకి ఏటీఎం సెంటర్ రెంట్ ఇచ్చే స్థితిలో లేదా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.