ప్రైజ్ మనీపై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

  • జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లలో రాణించే క్రికెటర్లకు ఇక ప్రైజ్‌మనీ 
  • పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకూ వర్తింపు    
  • ఎక్స్ వేదికగా వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జై షా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్స్‌లో మెరిసే ఆటగాళ్లకు సైతం నగదు బహుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచే ప్లేయర్ లకు ప్రైజ్ మనీ ఇవ్వాలని తీర్మానించింది. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. దేశవాళీ లీగ్స్‌తో పాటు జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లలో అద్భుతంగా రాణించే పురుష, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ నగదు బహుమతి ఇవ్వనుందని షా పేర్కొన్నారు. 
 
“దేశవాళీ క్రికెట్ కార్యక్రమంలో భాగంగా పురుషులు, మహిళల జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ ప్రవేశపెడుతున్నాం. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ ట్రోఫీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వాళ్లకూ ప్రైజ్ మనీ ఇస్తాం” అని షా పేర్కొన్నారు.


More Telugu News