వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్ బోర్డు

  • ఈరోజు సమావేశమైన తెలంగాణ వక్ఫ్ బోర్డు
  • కేంద్రం తెచ్చిన బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందన్న బోర్డు
  • బిల్లు తిరస్కరణకు మద్దతు తెలిపిన సీఎంకు థ్యాంక్స్ చెప్పిన అసదుద్దీన్
వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పలువురు వ్యతిరేకిస్తున్నారు. సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ వక్ఫ్ బోర్డు వెల్లడించింది.

చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ అధ్యక్షతన సోమవారం నాడు తెలంగాణ వక్ఫ్ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఈ బిల్లు తిరస్కరణకు మద్దతు ఇచ్చిన తెలంగాణ సీఎంకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News