త్వరలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి అచ్చెన్నాయుడు
- కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందన్న అచ్చెన్న
- గత ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పులు చేసిందని వెల్లడి
- ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని వివరణ
- అయినప్పటికీ హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టీకరణ
తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అచ్చెన్నాయుడు చెప్పారు. త్వరలోనే ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.